Pages

1 / 3
Caption Text
2 / 3
Caption Two
3 / 3
Caption Three

Sunday, 17 November 2019

how to put password to pdf files || pdf files కి పాస్వర్డ్ పెట్టడం ఎలా

          Pdf  ఫైల్స్ కి పాస్వర్డ్ పెట్టడం ఎలా? మనం pdf  ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని మాములుగా ఓపెన్ అవుతాయి. కానీ మరి కొన్ని pdf  ఫైల్స్ ఓపెన్ అవ్వవు. పాస్వర్డ్ టైపు చేయాలి అని వస్తుంది. అంటే ఇలాంటి pdf  ఫైల్స్ ని కేవలం  కరెక్ట్  పాస్వర్డ్ టైపు చేయడం వలన pdf  ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ pdf  ఫైల్స్ ని పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
 మరి అలాగే మీ pdf కి పాస్వర్డ్ పెట్టడం ఎలా అని ఇందులో చెప్పబోతున్నాను.


  1. ముందుగా google క్రోమ్ లోకి వెళ్లి సెర్చ్ బార్ లో www.ilovepdf.com అని టైపు చేసి ఎంటర్ చేయాలి. 
  2. ఆ వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఇందులో protect  pdf  మీద క్లిక్ చేయాలి. 
  3. అప్పుడు తరవాత tab ఓపెన్ అవుతుంది.  ఇందులో select pdf  మీద క్లిక్ చేయాలి. 
  4. ఫైల్ అప్లోడ్ చేయాలి. 
  5. పక్కన ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ చేసి పాస్వర్డ్ టైపు చేసి protect PDF మీద క్లిక్ చేయాలి. 
  6. తరవాత tab లో download protected pdf  మీద క్లిక్ చేయాలి. 
డెస్క్టాప్ లో pdf  files కి పాస్వర్డ్ పెట్టడం ఎలా


నా వివరణ నచినట్లైతే మీ స్నేహితులకు  షేర్ చేయగలరు. 

Telugu Sanchi ఫేస్బుక్ పేజీ  లైక్ కొట్టగలరు. 

  

Friday, 8 November 2019

How to Setup Fingerprint Lock on WhatsApp || వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఎలా పెట్టుకోవాలి.

          వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. అదే ఫింగర్ ప్రింట్ లాక్. ఇప్పుడు ఎటువంటి ఇతర యాప్స్ ని వాడాల్సిన అవసరం లేదు ఫింగర్ ప్రింట్ లాక్ కోసం. ఈ ఫీచర్ కోసం మనకి ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కల స్మార్ట్ ఫోన్ కావాలి. ఈ ఫీచర్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఐఫోన్లకి వచ్చింది. మరియు ఆండ్రాయిడ్ యూజర్స్కి  బీటా వెర్షన్ లో ఆగష్టు లోనే వచ్చింది.

How to Setup Fingerprint Lock on WhatsApp


వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఎలా పెట్టుకోవాలి?

ఈ ఫింగర్ ప్రింట్ లాక్ కోసం మనం ముందుగా 2.19.221 వెర్షన్ గల లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ గల వాట్సాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. 

  1. వాట్సాప్ యాప్ ని తెరచి కుడి వైపున ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేయాలి. 
  2. అందులో సెట్టింగ్స్  ని మీద క్లిక్ చేసి అకౌంట్ మీద క్లిక్ చేయాలి. 
  3. ప్రైవసీ మీద క్లిక్ చేయాలి.  అన్నిటి కన్నా చివర ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 
  4.  అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 
  5. అప్పుడు ఆటోమేటిక్ లాక్ సెలెక్ట్ చేసుకోగలరు. అనగా ఎప్పటి టైంలోగా లాక్ పడాలి అని. 
  6. షో కంటెంట్ ఇన్ నోటిఫికెషన్స్ సెలెక్ట్ చేసుకోవడం వలన మేసేజ్ కంటెంట్ మరియు సెండర్ కంటెంట్ నోటిఫికెషన్స్ లో చూడవచ్చు. 
          ఇప్పుడు మీరు వాట్సాప్ తెరిచినప్పుడల్లా, మీరు సెట్ చేసిన ఆటోమేటిక్ లాక్ వ్యవధిని బట్టి, మీరు ఫింగర్ ప్రింట్ లాక్ ఉపయోగించవలసి ఉంటుంది. 

మీకు గాని న వివరణ నచినట్లైతే షేర్ చేయగలరు. 

Telugu Sanchi ఫేస్బుక్ పేజీ  లైక్ కొట్టగలరు. 

Friday, 1 November 2019

మనం వాడే ఫోన్ నంబర్స్ లో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉన్నాయి || Why indian phone numbers have 10 digits

          ప్రస్తుతం మనం వాడే ఫోన్ నంబర్స్ లో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉన్నాయి. 10 అంకెల కన్నా తక్కువ మరియు ఎక్కువ ఎందుకు ఉండకూడదు. సాధారణంగా  మన ఫోన్ నెంబర్ లో ఒక అంకె మాత్రమే ఉంటే (ఉదాహరణకు ఫోన్ నెంబర్: # అయితే ) అప్పుడు కేవలం 10 మందికి మాత్రమే ఫోన్ నంబర్స్ ఉంటాయి.  ఎలాగంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0.  ఒకవేళ ఫోన్ నెంబర్ లో రెండు అంకెలు ఉంటే (ఉదాహరణకు ఫోన్ నెంబర్: ## అయితే ) అప్పుడు 100 మందికి మాత్రమే ఫోన్ నంబర్స్ ఉంటాయి. ఎలాగంటే 00, 01, 02,.......97, 98, 99.

telugusanchi || telugu sanchi ||why indian phone numbers have 10 digits


ఈ విధంగా
ఫోన్ నెంబర్ లో 1 అంకె వస్తే 10 మందికి
ఫోన్ నెంబర్ లో 2 అంకెలు వస్తే 100  మందికి
ఫోన్ నెంబర్ లో 3 అంకెలు వస్తే 1000 మందికి
ఫోన్ నెంబర్ లో 4 అంకెలు వస్తే 10000 మందికి
ఫోన్ నెంబర్ లో 5 అంకెలు వస్తే 100000 మందికి
ఫోన్ నెంబర్ లో 6 అంకెలు వస్తే 1000000 మందికి
ఫోన్ నెంబర్ లో 7 అంకెలు వస్తే 10000000 మందికి
ఫోన్ నెంబర్ లో 8 అంకెలు వస్తే 100000000 మందికి
ఫోన్ నెంబర్ లో 9 అంకెలు వస్తే 1000000000 మందికి
ఫోన్ నెంబర్ లో 10 అంకెలు  వస్తే 10000000000 మందికి  ఫోన్ నంబర్స్ ఉత్పత్తి చేయవచ్చు.

          మన దేశ జనాభా 136 కోట్లు(2019). కాబట్టి మన ఫోన్ నెంబర్ లో 9 అంకెలు ఉంచితే  కేవలం 100 కోట్ల మందికి ఫోన్ నంబర్స్  ఉత్పత్తి చేయవచ్చు. అదే మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఉంచితే 1000 కోట్ల మందికి ఫోన్ నంబర్స్ ఉత్పత్తి చేయవచ్చు. అందుకనే ముందుగా  ఆలోచించి మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు వచ్చేలా పెట్టారు. ప్రస్తుతం మనకి 9 సిరీస్, 8 సిరీస్, 7 సిరీస్ మరియు 6 సిరీస్ వచ్చాయి. ఇంకా 5, 4, 3, 2, 1 సిరీస్ కూడా భవిషత్తులో వచ్చే అవకాశం ఉంది.

మీకు నా వివరణ నచినట్లైతే షేర్ చేయగలరు.
Facebook  లో మా Telugu Sanchi ని లైక్  చేయండి .  ఇక్కడ క్లిక్ చేయండి