మీకు తెలుసా! మన ఫోన్ లో సిగ్నల్స్ లేకపోయినా మరియు సిమ్ లేకపోయినా ఎమర్జెన్సీ కాల్స్ అనగా అత్యవసర కాల్స్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కాల్స్ అనగా పోలీసు, అంబులెన్సు మరియు అగ్నిమాపక వాహనం కొరకు చేయు కాల్స్.
అసలు మన ఫోన్ నుండి కాల్ చేసుకోవటానికి ఉపయోగపడేది సిమ్ కాదు మన ఫోన్ లో ఉండే యాంటీనా. మరి మీకు అనుమానం రావచ్చు మరి సిమ్ ఎందుకు వాడతారు అని. సిమ్ కార్డు మనం ఫోన్ కాల్ చేసేటప్పుడు మనకంటూ ఒక ప్రత్యేక ఐడీ కోసం, అసలు మనం ఏ నెట్వర్క్ వాడుతున్నాం , మనం ఫోన్ కాల్ చేసుకోవటానికి సరిపడా బాలన్స్ ఉందా లేదా, మనం ఎవరెవరికి కాల్స్ చేస్తున్నాం వంటి వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే సిమ్ కార్డు ఉపయోగపడుతుంది.
సాధారణంగా ఒక ఫోన్ నుండి ఫోన్ కాల్ చేసేటప్పుడు ఆ ఫోన్ లో ఉండే యాంటీనా దగ్గరలో ఉండే నెట్వర్క్ కి అనుసంధానం అయ్యే ముందు ఆ ఫోన్ లో ఉండే సిమ్ కార్డు ఆ ఫోన్ లో కాల్ చేసుకోవటానికి ఫోన్ లో బాలన్స్ ఉందా లేదా అని నిర్ధారించి సరిగా వుంటే అప్పుడు నెట్వర్క్ తో కలవడానికి ఫోన్ కి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే ఫోన్ లో ఉన్న యాంటీనా ద్వారా నెట్వర్క్ కు అనుసంధానం అవుతుంది.
కానీ మరి ఎమర్జెన్సీ కాల్స్ చేసేటప్పుడు ఎం జరుగుతుందో చూద్దాం. దాదాపుగా ప్రతి ఫోన్ లోను, ప్రతి సిమ్ లోను ఎమర్జెన్సీ నంబర్లు ముందుగా సేవ్ అయి ఉంటాయి. ఈ నంబర్స్ కి ఫోన్ కాల్ చేయవల్సిన సమయం లో సిమ్ నుండి వచ్చే పర్మిషన్ కి సంబంధం లేకుండా డైరెక్ట్ గ ఫోన్ లోని యాంటీనా దగ్గరలో ఉండే నెట్వర్క్ కి కనెక్ట్ అవుతుంది.ఎటువంటి బాలన్స్ అవసరం లేదు. అది దగ్గరలో ఏ నెట్వర్క్ అయినా ఫర్వాలేదు. ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఇలా ఏదైనా. అయితే ఇంకొక విషయం మనం ఉన్న ప్రదేశం లో అసలు ఏ ఇతర నెట్వర్క్లు కూడా లేకపోతే ఎమర్జెన్సీ కాల్ చేసుకోవటానికి సాధ్యం కాదు.
మరి మీకు ఈ వివరణ నచినట్లయితే షేర్ చేయగలరు.




