Pages

1 / 3
Caption Text
2 / 3
Caption Two
3 / 3
Caption Three

Friday, 18 October 2019

జియో ఎందుకు ఇలా చేసింది || why jio charges 6 paisa from customer

          ఒకప్పుడు ఉచిత కాల్స్ మరియు ఉచిత డేటా తీసుకువచ్చిన jio ఇప్పుడు ఆరు పైసలు ఎందుకు వసూలు చేస్తుంది?


         మనదేశంలో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మరియు ఇతర ఏ నెట్వర్క్ అయినా TRAI ఆదేశాల ప్రకారం ప్రవర్తించాలి. అసలు TRAI అనగా Telecom Regularity of India. మనకు 2011 ముందు IUC charges ఉండేవి. IUC చార్జెస్ అనగా Interconnect User Charge. ఉదాహరణకు ఎయిర్టెల్ నెట్ వర్క్ నుండి ఐడియా నెట్వర్కు కాల్ చేసేటప్పుడు ఐడియా ఎయిర్టెల్ కాలును తీసుకొని ఐడియా తన సేవలను ఎయిర్టెల్ కు అందించినందుకు ఐడియా ఎయిర్టెల్ నుండి కొంత రుసుమును వసూలు చేస్తుంది. ఇలా ఈ రుసుము 2011 ముందు ఆరు పైసలుగా ఉండెను. తరవాత నుండి TRAI ఈ IUC చార్జెస్ రద్దు చేసింది. అంటే ఒక నెట్ వర్క్ నుండి మరొక నెట్వర్కు కు కాల్ చేసేటప్పుడు ఏ నెట్వర్క్ మరొక నెట్వర్క్ కి ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదు అని. అప్పట్లో Jio రాకముందు మనము ఒక నిమిషమునకు రూపాయి వరకు చెల్లించేవాళ్ళము. అలాంటిది Jio రావడంతోనే ఉచిత డేటా మరియు ఉచిత కాల్స్ అందించడం వల్ల మిగతా నెట్వర్క్లకు పెద్ద దెబ్బ ఎదురయింది. దానితో తమ వినియోగదారులు కూడా Jio నెట్వర్క్ కి మారిపోవడంతో తమకు చాలా నష్టం వస్తుంది. ఇందుకు వేరే నెట్వర్క్ లు Jio నుండి వచ్చిన కాల్స్ ను కలిపేవి కావు. అదేకాక మరల IUC చార్జెస్ పునః ప్రారంభించాలి అని TRAI మీద వత్తిడి తీసుకువచ్చాయి. దీంతో Jio తో పాటు మరల అన్ని నెట్వర్క్ లు ఆరు పైసలు చెల్లించాలి.

         అప్పటికే Jio ఉచిత కాల్ వలన వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా Jio IUC చార్జెస్ వేరే నెట్వర్కులకి చెల్లించేది. ఇలా ఉచిత కాల్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు వేరే నెట్వర్క్ వినియోగదారులు మిసిడ్ కాల్స్ ఇవ్వడం వల్ల Jio వినియోగదారుడు ఆ నెట్వర్క్ కు కాల్ చేస్తాడు. అప్పుడు Jio నెట్వర్క్ వేరే నెట్వర్క్ సేవలను వినియోగించడం వల్ల ఆరు పైసలు చెల్లించేది. ఈ విధంగా Jio మొత్తం 13,500 కోట్ల రూపాయలను వేరే నెట్వర్కులకు చెల్లించింది. మీకు అనుమానం రావచ్చు మరి Jio కి వేరే నెట్వర్క్ లు చెల్లించలేద? చెల్లించాయి. కానీ చాలా తక్కువ మొత్తంలోనే. ఎందుకంటే అప్పుడు వేరే నెట్వర్క్లు తమ వినియోగదారుల నుంచి ఎక్కువ రీఛార్జి లు వసూలు చేసేది దీని కారణంగా jio ఉన్నవాళ్ళ నుంచి మాత్రమే ఔట్గోయింగ్ మరియు ఇన్కమింగ్ సేవలను మాత్రమే వాడేవారు. ఇలా Jio ఎక్కువ రుసుము వేరే నెట్వర్క్ వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది.


మరి ఈ IUC చార్జెస్ ఎప్పటి వరకు ఉంటాయి?
ఈ IUC చార్జెస్ డిసెంబర్ 31 2019 వరకు మాత్రమే.

ఈ IUC చార్జెస్ కి తమ వినియోగదారులకు jio ఏం ఇస్తుంది?
Jio తమ వినియోగదారులకు ప్రతి 10 రూపాయలు IUC చార్జెస్ కింద వినియోగించనందుకు 1 జీబి డేటా ఇస్తుంది.meu ip

నా వివరణ  మీకు నచ్చినట్లైతే  మీ మిత్రులకు షేర్ చేయగలరు. 

No comments:

Post a Comment